Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’
- April 5, 2026 / 11:08 PM ISTByPhani Kumar
నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాకస'(Raakaasaa) చేసింది.
Raakaasaa
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ షోలు కూడా వేశారు. వాటికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. రెండో రోజు.. మొదటి రోజు కంటే బెటర్ గా కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి 2 డే కలెక్షన్స్ ని గమనిస్తే
| తెలంగాణ | 1.85 cr |
| సీడెడ్ | 0.38 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.30 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.53 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.59 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 5.12 cr(షేర్) |
‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.5.12 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.35 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.9.88 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’















