Raashi Khanna: ప్రభాస్-నాగశ్విన్ సినిమాలో రాశి!

  • June 11, 2021 / 06:25 AM IST

ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. వీటితో పాటు నాగశ్విన్ తో మరో సినిమా చేయనున్నాడు. సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ రాశిఖన్నాకు ఈ సినిమాలో ఓ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పదుకోన్ ను తీసుకున్నారు. ఆమెతో పాటు అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం రాశిఖన్నాను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో రీచ్ ఎక్కువ ఉంటుందనే ఫీలింగ్ తో రాశి సినిమాలో నటించడానికి అంగీకరించిందట. ఈమెతో పాటు తమిళ, మలయాళ నటీనటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం రాశిఖన్నా తెలుగులో ‘థాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా అమ్మడు చేతుల్లో ఐదారు తమిళ సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus