ప్రేమ సన్నివేశాల్లో ఇప్పుడు అదరగొట్టేస్తున్నారు… మరి కాలేజీ చదువుకునే రోజుల్లో ఇంకెంతమందిని ప్రేమలో ముంచేశారో! హీరోయిన్ల చూసినప్పుడు చాలామందికి ఇదే డౌట్ వస్తుంటుంది. అంతలా లవ్సీన్స్లో రెచ్చిపోతారు మన నాయికలు. కొంతమంది విషయంలో ఇది కరెక్టేమో కానీ… చాలామంది విషయంలో కాదు. కావాలంటే రాశీ ఖన్నానే తీసుకోండి. ఆమె లైఫ్లో ఫస్ట్ లవ్ గురించి ఆ కుర్రాడికి చెబుదాం అని అనుకుని చెప్పలేకపోయిందట. రాశీ ఖన్నా మొదటి నుండి అల్లరి పిల్లేనట.
స్నేహితులతో కలసి వీధిలో చిన్నసైజ్ గ్యాంగే నడిపేదట. పక్కింటివాళ్లకు, ఎదురింటి వాళ్లకు వచ్చే ఉత్తరాలు దొంగతనంగా ఓపెన్ చేసి చదివేసేవారట. అలా వాటిల్లో ఉండే ప్రేమలేఖలను కూడా ఓ లుక్కేసేదట. ఆ లెటర్లను చదివి… అందరికీ చెప్పి నవ్వుకునేదట. ఈ క్రమంలో ప్లస్ టూలో చేరాక… సీనియర్ అబ్బాయిని ఇష్టపడిందట రాశి. అయితే అప్పటికి ఆమె కాస్త సిగ్గరిని కావడంతో ధైర్యం చేసి చెప్పలేకపోయిందట. అయితే కొన్నాళ్లకు ఆ అబ్బాయే రాశీ దగ్గరికొచ్చి… ‘మీరంటే ఇష్టం’ అని చెప్పాడట.
అయితే అప్పటికే ఆమెది ప్రేమ కాదని… అదంతా ఆకర్షణ అని తెలిసిపోయిందట. దీంతో రాశీ తొలి ప్రేమ కేవలంగా ఆకర్షణగా మారి… అలా ఉండిపోయింది. ముందే ధైర్యం చేసి చెప్పుంటే… ఫస్ట్ లవ్ సక్సెస్ అయ్యేదేమో.