ఒకవారం రోజుల క్రితం “రాశీఖన్నా టాలీవుడ్ వదిలేసి వెళ్లిపోతుంది, ఇక్కడ కొనుక్కున్న ఇల్లు అమ్మేస్తుంది” అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అలాంటి వార్తలు రావడానికి కారణం ఏంటంటే రాశీకి టాలీవుడ్ నుండి కొత్త ఆఫర్లు రాకపోతుండడమే. అయితే.. గత శుక్రవారం విడుదలైన “వెంకీ మామ” సూపర్ హిట్ అవ్వడం, ఆమె నటిస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజూ పండగే” ఈవారం విడుదలవుతుండడం.. ఈ సినిమా సక్సెస్ పై ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం.. ఇక నిన్న విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” కొత్త పోస్టర్ లోనూ విజయ్ కి జంటగా రాశీ సూట్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో రాశీఖన్నా ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది.
మరి ఈ సడన్ క్రేజ్ వల్ల మనసు మార్చుకుందో లేక నిజంగానే అవన్నీ రూమర్సో తెలియదు కానీ.. “టాలీవుడ్ ను వదిలి నేను ఎందుకు వెళ్లిపోతాను?” అని తనను ఈ విషయమై ప్రశ్నించిన మీడియా సభ్యులను తిరిగి ప్రశ్నించింది. టాలీవుడ్ లో అండంతోపాటు సమానమైన అభినయ సామర్ధ్యం ఉన్న అతి తక్కువమంది హీరోయిన్లలో రాశీ ఒకరు. మంచి పాత్ర లభించాలే కానీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుంది అనడంలో సందేహం లేదు. మరి అమ్మడి టాలెంట్ కు తగ్గ పాత్రలు ఆమెకు లభిస్తాయో లేదో చూడాలి.