Raashi Khanna: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా..!

  • February 1, 2022 / 02:35 PM IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశీ ఖన్నాకి ఛాన్స్ లు తగ్గినట్టు కనిపించాయి.దాంతో ఈ అమ్మడు వరుసగా హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వచ్చింది. దాని ఎఫక్టే అనుకుంట.. ఈ అమ్మడికి ఆ తర్వాత నుండీ వరుస అవకాశాలు క్యూలు కడుతూ వచ్చాయి.గోపీచంద్ తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`,నాగ చైతన్య `థాంక్యూ` చిత్రాల్లో ఛాన్స్ లు కొట్టిన రాశి..అటు తర్వాత త‌మిళంలో `స‌ర్దార్`, `తిరుచిత్రాంబ‌లం`, `మేధావి`, `సైతాన్ కా బచ్చా` వంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.

వీటితో పాటు హిందీలో `యోధ‌` మూవీ … రెండు వెబ్ – సిరీస్ ల‌తోనూ బిజీగా గడుపుతూ వస్తోంది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలో మరో పెద్ద సినిమా వచ్చి పడింది. అది కూడా స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి.. తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు దీనికి నిర్మాత.

విజయ్ చేస్తున్న బీస్ట్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రాశీ ఖన్నా ఎంపికైందట. విజయ్ కు తమిళ్ లో రూ.200కోట్ల మార్కెట్ ఉంది. తెలుగులో కూడా రూ.15 కోట్ల మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఇలాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రాశీ ఖన్నాకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఈమె కెరీర్ చూసుకుంటే ఇప్పటివరకు ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరో స్టార్ హీరోతో జతకట్టింది లేదు. విజయ్ తో చేస్తున్న ఈ మూవీ కనుక వర్కౌట్ అయితే రాశీ ఖన్నాకి ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న బ్రేక్ వచ్చినట్టే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus