‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఆ తరువాత ‘జిల్’,’బెంగాల్ టైగర్’ వంటి చిత్రాల్లో మెరిసిన ఈ భామ రీసెంట్ గా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘సుప్రీమ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.
అయితే ఓ హీరోని పట్టుకొని… కాస్త ఘాటుగానే కామెంట్ చేసింది ఈ బొద్దుగుమ్మ. ఆ హీరో ఎవరో కాదు. సాయిధరమ్‌తేజ్. సుప్రీమ్ సినిమా సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులైపోయారు. ఎంతలా అంటే పబ్లిక్ గానే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకునేంత. సాయిలాంటి భర్త ని కోరుకొంటారా? అని రాశీ ఖన్నాని అడిగితే… ‘నాకు సాయిలాంటోడు వద్దు… తను చాలా పొట్టి’ అనేసింది.
దానికి సాయి షాక్ తినుంటాడు. వెంటనే తేరుకొని ‘మేడమ్ గారికి 6.2 కావాలేమో చూడండి’ అంటూ కౌంటర్ వేశాడు. ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి కామెంట్లు చల్తా.. కానీ.. మీడియా ముందు కూడా పొట్టి.. అనగలిగిందంటే.. ఇద్దరూ ఎంత క్లోజో ఆలోచించండి. డైరెక్ట్ గానే హీరోను కామెంట్ చేసిందంటే ఎంతైనా రాశికి కాస్త గట్స్ ఎక్కువనే చెప్పాలి.