“ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా?!” అని పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు పాయల్ కి సరిగ్గా సూట్ అవుతుంది. తెలుగులో కేవలం రెండు సినిమాలు, ఒక ఐటెమ్ సాంగ్ చేసిన పాయల్ కి ప్రాంతీయ ప్రజల్లో ఉన్న క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు “వెంకీ మామ” అండ్ టీం. ఇటీవల “వెంకీ మామ” టీం సినిమా ప్రమోషన్స్ కోసం బస్ టూర్ నిర్వహించారు. ఆ టూర్ లో భాగంగా పలు ఊళ్ళు సందర్శించారు. ఈ క్రమంలో జనాలు హీరోయిన్ రాశీఖన్నా కంటే ఎక్కువగా పాయల్ ను గుర్తుపడుతుండడం.. పదే పదే ఆమె పేరును హైలైట్ చేస్తుండడం చూసి టీం మెంబర్స్ అందరూ షాక్ అయ్యారట.
అయితే.. పాయల్ పాపులారిటీకి కారణం కేవలం “ఆర్ ఎక్స్ 100” సినిమాలో ఆమె ఆరబోసిన అందాలు మాత్రమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. సోషల్ మీడియాలో పాయల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా టిక్ టాక్ లో ఆమెకు రీజనల్ ఫాలోవర్స్ ఎక్కువ. ఆ యాప్ ద్వారానే పాయల్ జనాల్లో భీభత్సమైన పాపులారిటీ సంపాదించుకొంది. దాంతో ఇప్పుడు రాశీఖన్నా కూడా ఆ యాప్ లో జాయిన్ అవ్వాలని చూస్తోందట.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!