తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా అంటే 50వ సినిమాగా రూపొందింది ‘రాయన్'(Raayan). ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే హీరో ధనుష్ దీనిని డైరెక్ట్ చేయడం. అలాగే ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ధనుష్ తో పాటు ఈ చిత్రంలో సందీప్ కిషన్ (Sundeep Kishan ) , కాళిదాస్ జయరామ్ (Kalidas Jayaram) , అపర్ణ బాలమురళి (Aparna Balamurali) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి.
జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి వివరాలు తెలుసుకుందాం రండి :
నైజాం | 1.10 cr |
సీడెడ్ | 0.30 cr |
ఆంధ్ర(టోటల్) | 0.70 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.10 cr |
‘రాయన్’ చిత్రానికి తెలుగులో రూ.2.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మధ్య ధనుష్ సినిమాలు తెలుగులో కూడా బాగానే చూస్తున్నారు.పైగా ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు.! కాబట్టి.. పాజిటివ్ టాక్ కనుక వస్తే ‘రాయన్’ తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.