Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

ఒక సినిమాలో ఒక రకం పాత్రలో కనిపిస్తే.. ఆ తర్వాత అదే రకం పాత్రలు వరుస కట్టడం హీరోయిన్ల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం. దీనికి చాలానే ఉదాహరణల ఉన్నాయి. ఇలాంటి కథానాయికల్లో రాధికా ఆప్టే ఒకరు. తెలుగులో అన్నీ పద్ధతైన పాత్రలే చేస్తూ వస్తోన్న రాధికా ఆప్టే.. హిందీలో మాత్రం కాస్త లైన్‌ మీదనో, లైన్‌ దాటో నటిస్తూ ఉంటుంది. ఆ పాత్రల కారణంగా ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇటీవల చెప్పుకొచ్చింది.

Radhika Apte

గతంలో నేను చేసిన బోల్డ్ పాత్రల వల్ల, కథలో అవసరం లేకపోయినా నాతో ముద్దు సీన్లు చేయించాలని కొంతమంది దర్శక నిర్మాతలు ట్రై చేశారని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. లోదుస్తులతో మాత్రమే ఓ యాక్షన్ సీన్‌లో నటించాలని అడిగారని చెప్పింది. ‘కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించానని, అది చూసి ‘ఆమె సులభంగా అంగీకరిస్తుందిలే’ అని కొందరు అనుకున్నారని రాధిక తెలిపింది.

ఇప్పుడు నేను అలాంటి సినిమాలు, పాత్రలు చేయడంలేదు. సినిమా సన్నిహిత సన్నివేశాలు ఎందుకు అవసరమో స్పష్టమైన కారణం చెప్పాలని అడుగుతున్నాను అని చెప్పింది కొందరైతే ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి అని కొంతమంది అడుగుతున్నారని, ఆ మాట వింటే నాకు నవ్వొస్తుంది అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది.

ఒక సినిమా సెట్‌లో యాక్షన్ సీన్‌ కోసం షర్టు గుండీలు విప్పేసి నటించమని అడిగారని, యాక్షన్ సీన్ అంటే వేగంగా కదులుతాం కాబట్టి కుదరదని చెప్పానని తెలిపింది. అలా కాకపోతే కేవలం ఇన్నర్స్‌తో ఆ సీన చేయాలని అడిగారని, అసలు ఇలా చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అని వారిని ప్రశ్నించానని చెప్పింది. అందుకనే ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదని కూడా చెప్పింది.

అంతేకాదు తనను అలా అడిగిన వ్యక్తి పేరు చెబితే అంతా ఆశ్చర్యపోతారని, ఆ స్థాయి వ్యక్తి అలా మాట్లాడారు అంటే ఎవరూ ఊహించరు అని రాధిక హింట్ ఇచ్చి వదిలేసింది. ఒకప్పుడు చేస్తే ఇప్పుడూ చేయాలా అనేది ఆమె ప్రశ్న. అర్థమైంది కదా ఫ్యాన్స్‌ అండ్‌ డైరక్టర్స్‌.

‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus