సినిమా మొత్తం శృంగారమే కావాలంటే..ఎలా?

Ad not loaded.

తెలుగులో ‘రక్త చరిత్ర’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాధికా ఆప్తే .. మొదటి చిత్రంతోనే హిట్ అందుకుంది కానీ.. ఆ చిత్రంలో ఆమెనే హీరోయిన్ అన్న సంగతి గుర్తించడానికి చాలా కాలమే పట్టింది. అయితే తరువాత వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో మాత్రం ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. తరువాత మరోసారి బాలయ్యతో ‘లయన్’ వంటి చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ చిత్రం తర్వాత …. ‘సౌత్ లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.

వారికి విలువ కూడా ఉండదు. సౌత్ లో ఓ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు’ అంటూ కామెంట్స్ చేసి టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల తాను ఇటీవల చేసిన హాట్ ఫోటో షూట్ లు అన్నీ ఒకేసారి వడ్డించింది. ఈ ఫోటోలు కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక పనిలో పనిగా.. అభిమానులతో ఓ సారి ముఛ్చటించింది కూడా. ‘ఎందుకు ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చెయ్యడం లేదు..

అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఎక్కువగా శృంగారానికి ప్రాధాన్యత ఉన్న సీన్ల గురించే దర్శక నిర్మాతలు.. నన్ను సంప్రదిస్తున్నారు. బట్టలు లేకుండా నటించడానికి నేను ఏమాత్రం ఆలోచించను. కథలో భాగంగా అలాంటి సీన్లు ఉంటే చేస్తా.. కానీ కావాలని శృంగారపు సన్నివేశాలు ఇరికిస్తే నేను చెయ్యను” అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్తే.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus