Radhika Apte: రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • April 10, 2023 / 01:14 PM IST

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రాధికా ఆప్టే ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. గతంలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించి విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. అయితే తాజాగా రాధికా ఆప్టే రెమ్యునరేషన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు, ఇతర మహిళలకు రెమ్యునరేషన్, ఖ్యాతి, పేరు విషయాలలో సమానంగా ఉండాలని రాధికా ఆప్టే అన్నారు.

మహిళలు సినిమా రంగంలో వీటి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం అందరూ స్వాగతించాల్సిన విషయం అని రాధికా ఆప్టే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాలలో సైతం ఆడ, మగ అనే డిఫరెన్స్ లేని పరిస్థితి ఏర్పడిందని రాధికా ఆప్టే కామెంట్లు చేశారు.

హీరో హీరోయిన్ల క్రేజ్, పాపులారిటీ ఆధారంగా రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్రేజ్ ఉన్న హీరోయిన్లు 10 నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సందర్భాలు సైతం ఉన్నాయి. రాధికా ఆప్టే రెమ్యునరేషన్ల గురించి ఎన్నిసార్లు కామెంట్ చేసినా అందులో మార్పు వచ్చే అవకాశం లేదు. ఈ తరహా కామెంట్లు చేయడం వల్ల సినిమా ఆఫర్లు సైతం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్లు చెబుతున్నారు.

రాధికా ఆప్టే (Radhika Apte) పారితోషికం 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. గ్లామరస్ రోల్స్ లో ఈ బ్యూటీ ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధికా ఆప్టే బోల్డ్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. రాధికా ఆప్టే వయస్సు పెరుగుతున్నా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus