Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement

ఇండియన్‌ సినిమాకు మరపురాని సినిమాలను, అదిరిపోయే నటులను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కలసి పని చేసిన నటులు, దర్శకనిర్మాతలు ఆయనతో అనుబంధం గురించి గొప్పగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో మరింత ఎక్కవ అనుబంధం ఉన్న రాధిక తన మనసులోని భావాల్ని సోషల్‌ మీడియా వేదికగా వెలిబుచ్చారు. భారతీరాజాను తన గురువుగా భావించే రాధిక ‘మీరే నా సర్వస్వం..’ అని రాసుకొచ్చారు.

Radhika

నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు ఇద్దరు. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్లే. ఒకరు నా తల్లి. మరొకరు నా గురువు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే ఇద్దరినీ కోల్పోయాను. ఈ వేదనను మాటల్లో చెప్పలేను. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నా బాధను అర్థం చేసుకుని, నాతో పాటు నిలబడి, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను. వారి జ్ఞాపకాలు, వారు నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి అని ఆ పోస్టులో రాసుకొచ్చారు రాధిక.

ఇప్పుడే కాదు గతంలోనూ భారతీరాజా మీద రాధిక తన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. భారతీరాజా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన ఓ వీడియోను ఇప్పుడు షేర్‌ చేసుకున్నారు. రాధికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే. 1977లో ‘16 వయథినిలే’తో దర్శకుడిగా మారిన ఆయన తన రెండో సినిమా ‘కిళక్కే పొగమ్‌ రైల్‌’తో రాధికను కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తనను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దిన గురువుగా భారతీరాజాపై రాధికకు గౌరవం.

కొన్ని రోజుల క్రితం భారతీరాజాను రాధిక కలిశారు. ఈ క్రమంలో ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’ సినమా ప్రస్తావన వచ్చింది. దానికి భారతీరాజా స్పందిస్తూ.. ఈ సినిమాకు నీకు నేషనల్‌ అవార్డు వస్తుందన్నారు. ఆమె కూడా అంతే గౌరవంగా ఆ అవార్డు వస్తే వస్తే మీ పాదాల దగ్గర పెడతాను అని చెప్పారు. ఆ వీడియో ఆ మధ్య, మళ్లీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus