Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Advertisement

గోపీచంద్‌ మలినేని.. టాలీవుడ్‌కి ఓ 16 ఏళ్ల క్రితం దొరికిన మాస్‌ దర్శకుడు. ఆయన సినిమాల్లో హీరో ఊరమాస్‌గా కనిపిస్తాడు అని పేరు సంపాదించుకున్నారు. అలా వచ్చిన కొన్నేళ్లకే స్టార్‌ హీరోలతో మాస్‌ సినిమాలు చేస్తూ విజయాలు సాధించారు. మధ్యలో రెండు సినిమాల ఫలితాలు ఇబ్బంది పెట్టినా ‘క్రాక్‌’ సినిమాతో విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కేశారు. అప్పటి నుండి మాస్‌ మేనియా అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే గత మూడు సినిమాలుగా ఆయనపై ఓ అపవాదు పడింది.

Gopichand Malineni

అది ఆయన కావాలని చేసుకున్నదో, లేక అలా అవుతోందో కానీ వరుసగా ఇన్‌స్పిరేషన్‌ కామెంట్లు వినిపిస్తున్నాయి. గత రెండు సినిమాలు, ఇప్పుడు టీజర్‌ రిలీజ్‌ చేసిన సినిమాకు ఇదే మాట వినిపించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నిన్న విడుదల చేశారు. అందులో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాలు చూస్తే పవన్‌ కల్యాణ్ – సుజీత్‌ కాంబోలో వచ్చిన ‘ఓజీ’ సినిమా రిఫరెన్స్‌లు చాలానే కనిపిస్తున్నాయి.

ఒక్క టీజర్‌ చూసి గోపీచంద్‌ మలినేని టేకింగ్‌ గురించి ఇలా అనేస్తారా అనొద్దు. ఎందుకంటే ఆయన గత సినిమా ‘జాట్‌’లో చాలా తెలుగు సినిమాల రిఫరెన్స్‌లు కనిపించాయి. ఆ సినిమా బాలీవుడ్‌లో తీసింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే కాపీ మరక బలంగానే పడేది. ఇక అంతకుముందు తీసిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా లైన్‌ నుంచి టేకింగ్‌ వరకు.. ప్రచారం నుండి రిలీజ్‌ విధానం వరకూ అన్నీ బోయపాటి సినిమాల స్టైల్‌లో సాగాయి అనే విమర్శలు వచ్చాయి.

ఆ రెండు సినిమాలకు జరిగిన హడావుడి, ఇప్పుడు ‘ఎన్‌బీకే 111’ సినిమాకు జరిగిన హడావుడి మొత్తం కలిపితే గోపీచంద్‌ మలినేనికి ఈ ఇన్‌స్పిరేషన్‌ మరకు మంచిది కాదు అనిపిస్తోంది. చూద్దాం మరి సినిమా టేకింగ్‌లో తన మార్కు చూపించి ఆ మరకు చెరుపుకుంటారేమో చూడాలి.

రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus