ప్రముఖ సీనియర్ నటి రాధిక ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. నటి రాధిక తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ రాధిక శరత్ కుమార్ పేరుతో ఉన్న తన ట్విట్టర్ పేజీలోనే పోస్ట్ చేశారు. దయచేసి దీన్నుంచి బయటపడే వరకు ఓపిక పట్టండంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్విట్టర్ పేజీలో ఏవేవో సందేశాలు పోస్ట్ చేస్తుండడంతో రాధిక ఈ విషయాన్ని గుర్తించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన రికార్డు రాధిక సొంతం. చిరంజీవి, రాధిక మంచి హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. కమలహాసన్ తో కలసి నటించిన ‘స్వాతిముత్యం’ అయితే నిజంగా ఆమె కెరీర్ లో ఓ ఆణిముత్యమే.
అయితే.. ఎవరికీ అర్ధం కాని విషయం ఏంటంటే.. అసలు రాధిక ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. హ్యాక్ చేశారు సరే.. చేసినందుకు రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫేస్ బుక్ హ్యాక్ చేసినప్పుడు జరిగినట్లుగా ఏవైనా చెత్త పోస్ట్లు షేర్ చేయడం గట్రా జరగాలి కానీ.. ఏవేవో వింత సందేశాలివ్వడం ఏంటి అనేది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. కాకపోతే సంతోషించాల్సిన విషయం ఏంటంటే హ్యాక్ అయిన కొద్ది నిమిషాలకే ఆమె ఆమె తన ఎకౌంట్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు.