Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదించడంలో, ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా కొత్తతరహా కంటెంట్ రూపొందుంటున్న డిఫరెంట్ లవ్ స్టోరీ ‘రఘు’. ‘శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్’ సంస్థపై యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Raghu Glimpse

మహేష్ తారక్, మహేష్ కోటా, కరిష్మా,బంగ్లా వెంకట్, ప్రశాంత్ JPR, శివ, ప్రభు, రామ్ రోహిత్, శ్రీ సూర్య వంటి వారు ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో, ప్రేక్షకులను ఆద్యంతం అలరించే కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. కాంత్ పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించగా, శ్రీనివాస్. టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

టెక్నీకల్ గా హాయ్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం మరిన్ని చిన్న సినిమాలకి స్ఫూర్తిగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తుంది.ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుండి హీరోయిన్ లుక్ ను రివీల్ చేస్తూ చిన్న గ్లిమ్ప్స్ ను వదిలారు.ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. “మంచి కథ, బలమైన సాంకేతిక బృందంతో ‘రఘు’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్ కి కూడా పెద్దపీట వేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు.

దర్శకుడు సాయి కిషోర్ మాట్లాడుతూ..”మా సినిమాలో నటించిన నటీనటులంతా సూపర్ టాలెంటెడ్. అందరూ బాగా చేశారు.నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అనే బలమైన నమ్మకంతో చిత్రీకరణ జరుపుతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus