Rahul Dayakiran: నిజంగా టైసన్ లా మారిపోయిన నటుడు రాహుల్.. వైరల్ అవుతున్న లుక్..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించి బయ్యర్లకు 10 రెట్లు లాభాలను అందించింది. ఇంజనీరింగ్ కళాశాల కల్చర్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని రెండున్నర గంటల పాటు కళ్ళకు కట్టినట్టు.. అది కూడా బోర్ కొట్టకుండా చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో గుర్తుండి పోయే పాత్రల గురించి చెప్పాలి అంటే ఒకటి టైసన్..

మరొకటి రాజేష్ పాత్ర.టైసన్ పాత్రను రాహుల్ పోషించగా రాజేష్ పాత్రను ఇప్పటి క్రేజీ హీరో నిఖిల్ పోషించాడు. బక్కగా అమాయకంగా కనిపించే టైసన్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రను పోషించే రాహుల్ నిజ జీవితంలో కూడా గాలేస్తే ఎగిరిపోయేలా కనిపించేవాడు. అయితే ఇప్పుడు అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అనే చెప్పాలి. కండలు తిరిగిన దేహం, మీస కట్టుతో నిజంగానే టైసన్ లా కనిపిస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇతన్ని ఈ గెటప్ లో చూసి నెటిజన్లు షాక్ కు గురయ్యారు అనే చెప్పాలి. ‘ఏ టైసన్‌ నువ్వేనా?, అసలు నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్ లుక్’ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది ‘శ్రావ్స్‌ కానీ ఇప్పుడు నిన్నిలా చూస్తే నిజంగానే పడిపోద్ది’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘హ్యాపీ డేస్’ తర్వాత రాహుల్ ‘రెయిన్ బో’ ‘ముగ్గురు’ ‘లవ్ యూ బంగారం’ ‘వెంకటాపురం’ వంటి సినిమాల్లో నటించాడు కానీ సక్సెస్ సాధించలేకపోయాడు.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus