ట్రోల్ చేయడం మొదలుపెట్టగానే బయటపడ్డ ‘మన్మధుడు2’ డైరెక్టర్?

నిన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం టీజర్ తో పాటూ కింగ్ నాగార్జున ‘మన్మధుడు 2’ టీజర్ కూడా విడుదలైంది. నటుడు రాహుల్ రవీంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘మన్మధుడు2’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్, రొమాన్స్ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం టీజర్ విడుదలయ్యాక.. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే కామెడీ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది. వయసు మీద పడినా పెళ్ళికాని మధ్య వయస్కుడిగా నాగార్జున నటన ఆకట్టుకుంటుంది.

అయితే ఈ టీజర్ లో ఒక్క హీరోయిన్ కూడా కనిపించకపోవడం ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా హీరోయిన్ రకుల్ కనిపించకపోవడంతో.. ఆమె అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇవి చూసిన డైరెక్టర్ రాహుల్ వెంటనే స్పందించాడు. ‘ఈ చిత్రంలో రకుల్ తో పాటు కీర్తి సురేష్, సమంత కూడా నటిస్తున్నారు. అయితే వారిది కేవలం అతిధి పాత్రే. ఫుల్ టైం హీరోయిన్ రకుల్ మాత్రమే. టీజర్ లో హీరోయిన్ ని చూపించక పోవడానికి కారణం హీరోయిన్ పై ప్రత్యేకంగా ఓ టీజర్ ని కట్ చేయడమే కారణం. అందుకే రకుల్ ని మొదటి టీజర్ లో చూపించలేదు. అంటే రకుల్ కోసం ‘మన్మధుడు 2’ నుండీ మరో టీజర్ రాబోతుందనమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus