ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడనున్న రాజ్ తరుణ్

  • May 29, 2019 / 07:13 PM IST

“ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారీ 21F” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొన్న రాజ్ తరుణ్ కి ఆ తర్వాత వచ్చిన “ఈడోరకం ఆడోరకం” మినహా పెద్ద హిట్స్ లేవు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా.. ఆశించిన స్థాయి హిట్ మాత్రం దొరకలేదు. చాలా రోజుల తర్వాత తనను పట్టి పీడిస్తున్న కామెడీ జోనర్ నుంచి బయటపడి “లవర్” అనే సినిమా చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. కొంత విరామం అనంతరం “ఇద్దరి లోకం ఒకటే” అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు రాజ్ తరుణ్.

ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసి మళ్ళీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్న రాజ్ తరుణ్ నిన్న తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్విట్టర్ లో సమాధానం ఇస్తూ.. త్వరలోనే తన పెళ్లి అని, అది కూడా తాను ప్రేమించిన అమ్మాయితోనే అని సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా హీరోలు ఇలాంటి విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు.. కానీ రాజ్ తరుణ్ మాత్రం అందుకు భిన్నంగా ఆన్ లైన్ లోనే చెప్పేశాడు. అమ్మాయి ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ.. పెళ్లి తర్వాతైనా మనోడి కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus