‘అంధగాడు‘ అనంతరం రాజ్ తరుణ్ నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదలవ్వలేదు. అప్పటివరకూ ప్రతి నాలుగు నెలలకు ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చిన రాజ్ తరుణ్ ఒక్కసారిగా ఆగిపోయాడనిపించింది అందరికీ. రాజ్ తరుణ్ ప్రస్తుతం అనీష్ కృష్ణ దర్శకత్వంలో “లవర్” అనే సినిమా చేస్తున్నప్పటికీ.. అతడి మునుపటి చిత్రం “రాజుగాడు” మాత్రం అయిదారునెలలుగా విడుదలవ్వడానికి నానా ఇబ్బందులు పడుతూనే ఉంది.
ఎట్టకేలకు మే 11న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. మే 9న మహానటి రిలీజ్ కి రెడీగా ఉండడం, మే 11న పూరీ జగన్నాధ్ తన కుమారుడ్ని లాంచ్ చేస్తున్న “మెహబూబా” చిత్రం దిల్ రాజు సారధ్యంలో రిలీజావుతుండడంతోపాటు “భరత్ అనే నేను, రంగస్థలం, ఎవెంజర్స్” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తుండడంతో.. ఈ టైమ్ లో తన సినిమా రిలీజ్ చేయడం మంచిది కాదనుకొన్నాడో ఏమో కానీ.. మే 11న తన సినిమా విడుదల చేయడానికి వీల్లేదని చెప్పేశాడట. ఇంకో రెండు వారాలాగితే పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాడు రాజ్ తరుణ్. మరి రాజ తరుణ్ అంచనాలు ఏమేరకు నిజమవుతాయో చూడాలి.