శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ విడుదల చేశారు. రాజా హే రాజా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.
ఈ చిత్రం నిర్మాత మిత్ర శర్మ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఫేం రాహుల్ సిప్లిగంజ్ పాడిన హే రాజా సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది. రాహుల్ కి వున్న క్రేజ్ ట్యూన్ లో వున్న కిక్ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వటానికి కారణం. ఈ సాంగ్ ని ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీమణి అందించారు. క్యాచి లిరిక్స్ కావటం తో అందరికి ఫుట్ ట్యాపింగ్ అవుతుంది. మా దర్శకుడు దయా చాలా చక్కగా పిక్చరైజేషన్ చేయించాడు. మా శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం 1 గా వస్తున్న బాయ్స్ ఆడియో జ్యూక్ బాక్స్ చార్ట్‌బస్టర్ లో టాప్ లో నిల్చుంటుందని మా అందరి నమ్మకం. మా నమ్మకానికి స్మరన్ అందించిన ఆడియో సూపర్ ప్లస్ అయ్యింది. అలాగే మా సహ నిర్మాత బాలచందర్ చిత్ర నిర్మాణ బాధ్యతలు తీసకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కంటెంట్ డిస్ట్రబ్ అవ్వకుండా గ్రాండియర్ గా మాకు ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా నిర్మించారు. ఈ చిత్రం యొక్క మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రిలీజ్ చేస్తాము. అని అన్నారు.