టెక్నికల్ గా తెలుగు సినీ పరిశ్రమ స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ.., ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అనే విషయంలో మాత్రం మేకర్స్..కి రోజురోజుకూ కత్తిమీద సాములా మారుతోంది అనే చెప్పాలి.
‘బేబీ’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) ఈరోజు ‘సమ్మర్ హాలిడేస్’ అనే సినిమా ప్రెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తున్న క్రమంలో ప్రస్తుత సినిమా పరిస్థితులపై అలాగే సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ట్రెండ్స్‌పై కుండబద్దలు కొట్టాడు.
దీనివల్ల ఏది నిజమైన కంటెంట్, ఏది నకిలీ హైప్ అనేది గుర్తించడం ఆడియన్స్ కి కష్టంగా మారిందని, ఇది పరిశ్రమలోని చాలా మందిలో విరక్తిని, భయాన్ని కలిగిస్తోందని సాయి రాజేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు.మారుతున్న ప్రేక్షకుల అభిరుచి వల్ల కేవలం కొన్ని జోనర్లు మాత్రమే మిగిలాయని, ఒకవేళ తన ‘బేబీ’ సినిమా కనుక ఇప్పుడు విడుదలైతే.. ఆ సినిమా ఫుల్ రన్లో చేసిన కలెక్షన్లలో సగం కూడా కలెక్ట్ చేయదని సాయి రాజేష్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేవలం లాభాల కోసమే కాకుండా, సినిమాను ఒక కళగా భావించి ‘సమ్మర్ హాలిడేస్’ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి విభిన్నమైన చిత్రాలు తీస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని గట్స్..ను సాయి రాజేష్ అభినందించారు.సాయి రాజేష్ కామెంట్స్ తో చాలా మంది ఏకీభవిస్తున్నారు. గతేడాది వచ్చిన నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా నిర్మాత దిల్ రాజు ఇదే విషయంపై ఓపెన్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి సాయి రాజేష్ కూడా చేరాడు అని చెప్పాలి.
ట్విట్టర్ లో పోస్టులు , యూట్యూబ్ లో వ్యూస్, నెగిటివ్ కామెంట్స్ ను పాజిటివ్ చేయడం ఇవన్నీ మేము డబ్బులు పెట్టి కొనేస్తున్నాము
కాబట్టి జనాలకి ఏది ఒరిజినల్ కంటెంటో తెలీక సినిమాలపై విరక్తి పుట్టేసింది : సాయి రాజేష్#SummerHolidays #DheerajMogilineni #SaiRajesh pic.twitter.com/7bYeuXXDTW
— Filmy Focus (@FilmyFocus) May 27, 2026