సహా నటుడి ప్రాణం తీసిన నటి నోటి దూల!!

కాలు జారితే తీసుకోవచ్చుగాని, నోరు జారితే తీసుకోలేమనే సామెత ను పెద్దలు ఊరికే అనలేదని ఈ విషయం నిరూపించింది. చిన్న, చిన్న  వివాదాలకు ప్రాణాలు తీసుకోడం మనం చూస్తూనే ఉంటాం కాక పోతే ఇలాంటి వాటికి పాల్పడేది ఎక్కువుగా  సామాన్య ప్రజలు. కాని ఇది ఇప్పుడు సెలబ్రిటీలు కు  కూడా పాకింది. ఆ నటి నోటి దూల ఏకంగా ఒక నటుడి ప్రాణాన్ని తీసేయ్యడమే కాకుండా ఆమెను కటకటాలు లోకి పంపింది. ఓడిశా  లో సంచలనం సృష్టించిన ఈ వార్త ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది.వివరాలలోకి వెళితే..

ఓడిశా ప్రఖ్యాత టీవీ నటి జెస్సి ఒక టీవీ షో లో పాల్గొంది. దీనికి మరో టీవీ నటుడు రాజ పట్నాయక్ కూడా హాజరయ్యాడు. పారితోషకం జెస్సి 27 వేలు తీసుకిని రాజకి 2 వేలు ఇచ్చింది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఇద్దరు కలిసి ఒకే కార్ లో వెళ్ళేటప్పుడు  ఇక తన నోటికి  పని చెప్పి అతని పై విరుచుకుపడింది. ఇష్టం వచ్చినట్లు అతనే మీద కామెంట్స్ చేసింది. ఇది ముదిరి వివాదం గా మారడంతో నటి జెస్సి అతన్ని త్రీవం గా అవమానించింది. వాటిని తట్టుకోలేక, మనస్తాపానికి గురైన రాజా దారిలోనే కార్ ఆపమని చెప్పి అక్కడే ఉన్న బ్రిడ్జి మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలిసుల దర్యాప్తులో ఆమె నోటి దూల వల్ల ఇదంతా జరిగిందని తెలిసి ఆమె పై కేసు నమోదు చేసి అరెస్ట్  చేసి జైలుకి పంపారు. ఆమె నోటిని అదుపులో  పెట్టుకొంటే ఆ నటుడుకి చావు తప్పేది.ఏది ఏమైనా సూటిపోటి మాటల్ని భరించడం నిజంగా కష్టమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus