దర్శకుడు రాజమౌళి గురించిన ఏ వార్త వచ్చినా అది రికార్డుల గురించే అవుతుంది. అపజయం ఎరుగని అరుదైన దర్శకుడిగా ఉన్న రాజమౌళి స్టార్ హీరోలను శాసించే స్థాయిలో ఉన్నారు. ఇక ఆయనతో సినిమా కుదిరిందంటే ఆ హీరో పేరిట కొన్ని కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే. ఇది రాజమౌళికి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు. మరి ఇంత వెయిట్ ఉన్న ఈ దర్శకుడి రెమ్యూనరేషన్ గురించి చెప్పాలంటే దేశంలోనే ఏ దర్శకుడు తీసుకోనంత. దాదాపు హాలీవుడ్ దర్శకుల రెమ్యూనరేషన్ కి సమానంగా ఉంది.
మరి ఇలాంటి దర్శకుడు ఆపదలో ఉన్న సినీ కార్మికుల కోసం ఎంత ఇచ్చిఉంటాడు?..ఆకాశమంత అనుకుంటే పొరబాటే.. చిత్ర పరిశ్రమలో ధనిక దర్శకుడిగా ఉన్న రాజమౌళి కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం చేసిన దానం ఐదు లక్షలు. ఆయన డి వి వి దానయ్యతో కలిసి సి సి సి కొరకు పది లక్షల రూపాయల దానం చేశారు. నాలుగు వందల కోట్లతో సినిమా తీస్తున్న రాజమౌళి ఆయన సినిమా కోసం కూలి తీసుకొని పనిచేసే రోజూ వారి కార్మికుల కోసం ఐదు లక్షల రూపాల స్వల్ప విరాళం ప్రకటించారు.
ఒక్క బాహుబలి సినిమాకే వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న ఈ దర్శక దిగ్గజం పేద కార్మికుల సంక్షేమం కోసం ఇంత చిన్న మొత్తాన్ని అందించి దాన గుణంలో అతిపేదవాడని నిరూపించుకున్నారు. కనీసం సినిమాకు యాభై లక్షల రెమ్యూనరేషన్ లేని హీరో విశ్వక్ సేన్ సి సి సి కొరకు 5లక్షల సాయం చేశారు. ఇక రాజమౌళి ఈ విషయంలో ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!