Rajamouli: ఆర్ఆర్ఆర్ రిజల్ట్ పై జక్కన్న ఏమన్నారో తెలుసా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత కొంతకాలం కామ్ అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ హీరోగా తెరకెక్కే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమౌళి ఇతర సినిమాల ప్రమోషన్లలో పాల్గొంటూ, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఒక ఆంగ్ల మీడియా ఛానల్ తో జక్కన్న ముచ్చటించారనే సంగతి తెలిసిందే. జక్కన్న మాట్లాడుతూ బాహుబలి సినిమా తర్వాత నా సినిమాపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో బౌండరీలు దాటామని ఆయన కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ రిజల్ట్ గురించి తొలిసారి ఈ విధంగా స్పందించి రాజమౌళి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మన దేశ కథలు ప్రపంచస్థాయిలో ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నానని రాజమౌళి వెల్లడించారు. ఈ విషయంలో నేను ముందుండాలని అనుకుంటున్నానని ఇదే నా స్వార్థమని ఆయన తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే సమయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలు సక్సెస్ సాధిస్తే లాభాలు ఏ విధంగా ఉంటాయో సినిమాలు ఫ్లాప్ అయితే నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయని ఆయన అన్నారు.

అర్బన్ సినిమాల విషయంలో బడ్జెట్ తక్కువగా ఉండటంతో పాటు రిస్క్ కూడా తక్కువగా ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. మహేష్ బాబుతో జక్కన్న జంగిల్ బేస్డ్ అడ్వెంచరస్ స్టోరీని తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి ప్రేక్షకుల అంచనాలకు అందని సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. రాజమౌళికి సినిమాసినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా రాజమౌళికి భారీస్థాయిలో క్రేజ్ ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus