రాజమౌళి ఫామ్ హౌస్ సీక్రెట్స్!

  • October 1, 2017 / 08:50 AM IST

రాజమౌళి…వరుస హిట్స్ తో పరాజయం అన్న పదం లేకుండా దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల లిస్ట్ లో ఉన్నాడు రాజమౌళి. అయితే అదే క్రమంలో అసలు రాజమౌళి తన తరువాత సినిమా ఏంటి? ఎవరు హీరో? అసలు ఏ కధ తీస్తాడు అన్న ఆలోచనలు అన్నీ అందరి మదిలో మెడులుతున్న వేళ…మరో సరికొత్త న్యూస్ ఒకటి రాజమౌళి గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతూ ఉంది…ఏంటి ఆ న్యూస్ అంటే…రాజమౌళికి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని డిసైన్ చెయ్యమని మంచి అవకాశాన్ని అందించిన తరుణంలో అదే క్రమంలో ఆయన తన ఫార్మ్ హౌస్ ను కూడా డిసైన్ చేసుకునే క్రమంలో ఉన్నాడు…ఇంతకీ ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి…నల్గొండ సమీపంలో విజయవాడ హైవేకి దగ్గరగా రాజమౌళి ఎంతో ముచ్చటపడి నిర్మించుకుంటున్న ఫామ్ హౌస్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే…దాదాపు 120 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఫామ్ హౌస్ డిజైన్ పర్యవేక్షణ బాధ్యతలను జాతీయ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్  అయిన రవీందర్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫాం హోసే లో 50 ఎకరాలలో  మామిడితోట మరో 50 ఎకరాలలో సపోటతోట పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్.

ఇక మిగిలిన భూమిలోని  ఒక ఎకరంలో ఒక పెద్ద బంగ్లాను కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి చుట్టూ అందమైన పూల తోటలతోపాటు రాజమౌళి ఇంటి పక్కన చిన్నచిన్న కుటీరం లాంటి ఇళ్లను  కూడ  నిర్మిస్తారట  ఇంకా మిగిలిన ప్రాంతంలో పశువుల పాకలు పశుగ్రాసం కోసం కొంత భూమిని కేటాయించారు అని టాక్. అంతేకాదు కేవలం ఇళ్లే కాకుండా లోపల ఒక్కొక్క చోటికి దారులు ఎలా ఉండాలనేది అనే డిజైన్ కూడ రాజమౌళి పక్కాగా వేయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈదారులు ఇళ్ళు బంగ్లాల డిజైన్స్ చిన్న సైజు మహిష్మతి సామ్రాజ్య లుక్ లో ఉంటే వ్యవసాయం చేసే పొలం పశువులు కుటీరాలలో తన మర్యాద రామన్నలోని సహజత్వాన్ని మేళవించి ఉండే విధంగా రాజమౌళి ప్లాన్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఏమైనా…ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కు సంబంధించిన వార్తలు  ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలలో సంచలన వార్తలుగా మారుతున్నాయి అనడంలో ఏమాత్రం సాదేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus