సినిమా టీం ఎంతటి జాగ్రత్తలు తీసుకొంటున్నా.. ఈమధ్యకాలంలో సినిమాకి సంబంధించిన విషయాలు, విశేషాలతోపాటు ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అయిపోతున్నాయి. కానీ.. రాజమౌళి మాత్రం ఈ ప్రొసెస్ కు బ్రేక్ వేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇటీవల మొదటి షెడ్యూల్ ఫినిష్ చేసి తన కుమారుడి పెళ్లి కోసమని ఒక నెల గ్యాప్ ఇచ్చిన రాజమౌళి మళ్ళీ సంక్రాంతి తర్వాత సెకండ్ షెడ్యూల్ మొదలెట్టానున్నాడు. ఈలోపు ఎన్టీఆర్ కు బాడీ పెంచమని అల్టిమేటం జారీ చేశాడట రాజమౌళి. తన బాడీ మేకింగ్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పొరపాటున కూడా లీక్ అవ్వకూడదని దాదాపు వార్నింగ్ ఇచ్చాడట రాజమౌళి.
రాజమౌళి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని అర్ధం చేసుకుని ఎన్టీఆర్ కూడా ఈ నెలరోజుల పాటు బయటకి ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టూనే ఉండి జిమ్ లో వర్కవుట్ చేస్తూ రాజమౌళి కోరిన షేప్ వచ్చేందుకు సరేనన్నాడట. మరోపక్క రామ్ చరణ్ కూడా సరికొత్త బాడీ షేప్ కోసం కసరత్తులు మొదలెట్టాడట. ప్రస్తుతం ఈ ప్రొజెక్ట్ లో హీరోయిన్స్ ని ఫిక్స్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేసుకొంటున్నాడు.