రాజమౌళి చేస్తున్న తప్పు ఏంటి?

  • April 26, 2017 / 05:27 AM IST

టాలీవుడ్ హిట్ దర్శకుడు…ఇప్పటివరకూ ఫ్లాప్ అన్న పదం వినని దర్శకుడు…మన రాజమౌళి…అయితే ఈ సినిమా …ఎంత టైమ్ అయినా పర్వాలేదు కానీ…క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడని మనస్తత్వం మన రాజమౌళిది…అయితే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక్క విషయంలో మాత్రం కాస్త తప్పు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…అంతేకాదు…ఆ తప్పు కావాలనే చేస్తున్నాడేమో అన్న అనుమానాలు సైతం అందరినీ పలకరిస్తున్నాయి…విషయంలోకి వెళితే…టాలీవుడ్ సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి మన తెలుగు మీడియా చాలా సహకరిస్తుంది…ఇంకా చెప్పాలి అంటే ఇది మన సినిమా అనే కాస్త స్వార్ధంతో ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది…అయితే అలాంటి మీడియాని మన జక్కన్న పెద్ద పట్టించుకోవడం లేదు అని అంటున్నారు సినిమా వర్గాలు…వాళ్ళు తెలుగు మీడియాని పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్ బహుబలి విషయానికే వస్తే…బాహుబలి దేశ సినిమాగా ప్రమోట్ చేయబడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు….అయితే బాహుబలి మొదటి పార్ట్ లో కూడా తెలుగు మీడియా మీద కాసింత చిన్న చూపు చూపించారు చిత్రయూనిట్. అయినా సరే అదంత పట్టించుకోకుండా సపోర్ట్ గా నిలిచి సినిమా హిట్ అయ్యేందుకు ముఖ్య పాత్ర పోశించారు. అదే క్రమంలో బాహుబలి-2 విషయంలో కూడా ఇదే తప్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం నేషనల్ మీడియా మీదే దృష్టి అంతా పెట్టి తెలుగు మీడియాను చులకన చేస్తున్న భావన కలుగుతుంది. మరి ఈ చిన్న పొరపాట్లను మన జక్కన్న సరిదిద్దుకుంటాడు అని అందరూ ఆశిస్తూ బాహుబలి2 బ్లాక్ బష్టర్ హిట్ కావాలని ఆశిస్తున్నాం…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus