గేమ్ ఆఫ్ త్రోన్స్ సిరీస్ చాలా డిజప్పాయింట్ చేసింది: రాజమౌళి

“గేమ్ ఆఫ్ త్రోన్స్” ఈ సిరీస్ చూసినా చూడకపోయినా.. ఈ సిరీస్ గురించి తెలియనివారుండరు. కొన్నేళ్లుగా ఆన్ లైన్ వీక్షకుల్ని అలరిస్తున్న ఈ సిరీస్ చివరి సీజన్ ఇటీవల ముగిసింది. 7 సీజన్ల వరకూ రసవత్తరంగా సాగిన ఈ సిరీస్ ఎనిమిదవ సీజన్ మాత్రం దారుణంగా నిరాశపరిచిందని ఆ సిరీస్ ను ఏళ్ల తరబడి ఫాలో అవుతున్నవాళ్ళందరూ తెగ బాధపడిపోయారు. ముఖ్యంగా “గేమ్ ఆఫ్ త్రోన్స్”కి ఇదే లాస్ట్ సీజన్ కావడంతో ఇంకాస్త ఎక్కువగా బాధపడ్డారు.

అయితే.. నిన్న రాత్రి రాజమౌళి కూడా “అవును సీజన్ 8 డిజప్పాయింట్” చేసింది అని పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు కూడా సీజన్ 8 బాగోలేదు అని చెప్పడంతో.. అసలు ఈ సిరీస్ ను ఇప్పటివరకు చూడనివాళ్లు కూడా అసలు ఈ గోల ఏంటా అని సిరీస్ చూడడం మొదలెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి దెబ్బలు తగిలిన కారణంగా “ఆర్.ఆర్.ఆర్”కి బ్రేక్ రావడంతో ఆ గ్యాప్ లో మన రాజమౌళి ఇలా వెబ్ సిరీస్ లు చూస్తూ కాలం గడిపేస్తున్నారన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus