Rajamouli, Mahesh Babu: జక్కన్న విషయంలో మహేష్ ప్లాన్ ఇదేనా?

  • September 30, 2021 / 02:21 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదనే సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నా వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేయగా జక్కన్న కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కావడంతో రాజమౌళి మహేష్ సినిమా పనులను మొదలుపెట్టారు.

2022 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఒకవైపు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తూనే మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. మహేష్ బాబు కొన్నిరోజుల క్రితం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మరో బాహుబలి మాత్రం కాదని రాజమౌళి కామెంట్లు చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైందని డిసెంబర్ మొదటివారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. నవంబర్ నుంచి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. రాజమౌళికి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా ఉంటుందని సమాచారం.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus