RRR Movie: ఆర్ఆర్ఆర్ టైటిల్.. మరో సీక్రెట్ చెప్పిన రాజమౌళి!

  • December 31, 2021 / 06:04 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా.. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే అది అందరిలో ఆసక్తి కలిగించేలా ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో జనాల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇక సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అంశాలను కూడా చెబుతూ ఉంటారు.

ఇక RRR సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఇటీవల రాజమౌళి సీక్రెట్ ను రివీల్ చేశారు. దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమా టైటిల్ కూడా కథలో భాగమయ్యేలా ఉండాలి అని అనుకుంటాడు. దాదాపు అన్ని కథలకు ఆయనే సొంతంగా నిర్ణయించుకున్నాడు. కానీ RRR విషయంలో మాత్రం చాలా మంది సలహాలు తీసుకున్నారట. ఇక రెగ్యులర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంలో రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ నందమూరి తారక రామారావు పేర్లు కలిసేలా RRR సెట్ చేసుకుంటే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు.

అదే తరహాలో సినిమా అప్ డేట్స్ ను అందిస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అన్ని భాషల్లో కూడా ఆ టైటిల్కు మంచి క్రేజ్ దక్కింది.ఇక ఆ టైటిల్ ని ఫిక్స్ చేయాలని అనుకున్న రాజమౌళి ఆ RRR లో నే అన్ని భాషల వారికి అర్థమయ్యేలా మరొక క్యాప్షన్ కూడా ఇవ్వాలి అని అనుకున్నారు. RRR అంటే ‘రౌద్రం రణం రుథిరం’ అని అన్ని భాషల్లో కూడా అదే తరహాలో అర్థం వచ్చేలా టైటిల్ను వైరల్ చేసినట్లు రాజమౌళి వివరణ ఇచ్చారు.

ఏదేమైనా కూడా రాజమౌళి ఒక సినిమాను జనాల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలో చాలా తెలివిగా ఆలోచిస్తారు అని మరొకసారి రుజువైంది. ఇక RRR సినిమా జనవరి 7వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus