ఆర్.ఆర్.ఆర్ గురించి ఇప్పుడేం చెప్పినా తొందరపడడమే అవుతుంది..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. జూ.ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో రాంచరణ్ పై కొన్ని యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇక జూ.ఎన్టీఆర్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడంతో ఇటీవల ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాడు. ఈ ట్రిప్లో… ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కాస్ట్యూమ్స్ కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ ఏ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించ లేదు రాజమౌళి.

అయితే ఇటీవల రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై స్పందించాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీ గురించి ఏదైనా మాకోసం చెప్పండి అని విలేకరి రాజమౌళి అడిగిన ప్రశ్నకి… రాజమౌళి స్పందిస్తూ… “లేదండి… ఇప్పుడు ఆ చిత్రం గురించి నేనేమి చెప్పను. నేను ప్రతీ సినిమా గురించి ముందే చెప్పలేదు. ‘బాహుబలి’ కి ముందు నేను స్టోరీ ఏమీ చెప్పలేదు… ఒక్క ‘మర్యాద రామన్న’ .. ‘ఈగ’ సినిమా కథలను మాత్రం నేను ముందుగానే చెప్పాను. ఆడియన్స్ దృష్టికి ఏ చిత్రాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక్కో విధానం ఉంటుంది… దానినే నేను ఫాలో అవుతాను. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని ఏమీ కాదు. కానీ ఇది సమయం కాదు .. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus