నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిని డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి చూసి, వెంటనే ఆ చిత్ర బృందాన్ని అభినందించారు. “సాహో బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ.. మహా నటుడు నందమూరి తారకరామారావు గర్వపడేలా ‘శాతకర్ణి’ పాత్రను పోషించారు.ఇంతటి అద్భుత సినిమాను క్రిష్ 79 రోజులలో తీయడం ఆశ్చర్యకరం. ఆయన నుంచి నేను నేర్చుకోవలసింది ఎంతో ఉంది” అని దర్శకధీరుడు ట్వీట్ చేసిన సంగతి చేసిన అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి “క్రిష్, బాలయ్య ది బ్యాడ్ కాంబినేషన్” అని అన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ. అయినా ఇది వంద శాతం నిజం. స్వయంగా ఈ విషయాన్నీ జక్కన్న చెప్పారు. రెండు రోజుల క్రితం క్రిష్ ని రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“క్రిష్, బాలయ్య కాంబినేషన్లో సినిమా అనగానే అది బ్యాడ్ కాంబినేషన్ అనుకున్నాను. ఎందుకంటే బాలకృష్ణ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో. క్రిష్ తీసిన సినిమాలు చాలా సున్నితమైన అంశాలతో కూడుకున్నది. ఇద్దరికీ పొంతన ఎలా కుదురుతుంది. ఈ సినిమా తప్పకుండా ఫెయిల్ అవుతుంది అని అనుకున్నవారిలో నేను ఒకడిని” అని అప్పటి ఫీలింగ్ ని బయటపెట్టారు. “ఆ తర్వాత ట్రైలర్ దగ్గర నుంచి సినిమాపై నమ్మకాలూ పెరిగి పోయాయి. మూవీ బ్రహ్మాండంగా ఉంది” అంటూ ఇప్పటి రియాక్షన్ ని తెలిపారు. అలాగే 99 సినిమాలు చేసిన పెద్ద హీరో బాలకృష్ణకి, ఆ చిత్రాలకంటే గొప్ప హిట్ ఇచ్చిన క్రిష్ కి అభినందనలు చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.