సహజంగా వర్క్ ప్రెషర్ వల్లనో, లేకపోతే సీన్ తాను అనుకున్నట్లు రాకపోతేనో మన టాలీవుడ్ దర్శకులు కోపంతో ఊగిపోతారు. కొందరు అయితే హీరో, హీరోయిన్స్ ను చెంప చెళ్ళుమనిపించిన ధాకలాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఒత్తిళ్లలో కూడా సౌమ్యుడిగా..నెమ్మదిగా మంచితనంతో, సినిమాలు చేస్తూ, ఎక్కడ ఫ్లాప్ అన్న పదాన్ని దరిచేరనీయకుండా ముందుకు దూసుకుపోతున్న దర్శకుడు మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.
అయితే అలాంటి దర్శక ధీరుడుకి అందాల భామపై కోపం వచ్చింది… ఇంతకీ ఎందుకు ఆ కోపం ఆమె ఏం చేసింది అనేగా మీ డౌట్…అయితే ఈ స్టోరీ వినండి…బాహుబలి-2 సినిమాను ఎక్కడ కాంప్రమైస్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న అయితే ఆ సినిమాను తన సొంత సినిమాగా చేస్తూ ఉండడంతో, సినిమా విషయంలో ఎక్కడా తేడా రాకూడదు, అంతేకాకుండా ఎవ్వరూ ఆయనకు ఎదురు సైతం చెప్పకూడదు. ఖచ్చితంగా ఆయన మాట వినాల్సిందే….వింటారు కూడా….కానీ ఆందాల భామ అనుష్క ఆయన మాట వినకుండా జవదాటింది, ఇంతకీ ఏం జతిగింది అంటే…బాహుబలి తర్వాత అనుష్క సైజ్ జీరో సినిమా కోసం బాగా వెయిట్ పెరిగింది.
తర్వాత బాహుబలి 2 కోసం బాగా సన్నబడి, స్లిమ్‌గా మారాలని రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినా అనుష్క మాత్రం ఫిజిక్ విషయంలో కాస్త అశ్రద్ద చూపించిందట. మరో వైపు అనుష్క, ప్రభాస్‌లపై తెరకెక్కించే వార్ సీన్‌కు కనీసం ఐదు కేజీలైనా తగ్గాలని రాజమౌళి చెప్పినా అనుష్క మాత్రం దానిపై దృష్టి పెట్టకపోవడంతో రాజమౌళికి అనుష్కపై కోపం వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై అనుష్కపై బహిరంగంగానే సెట్స్ లోనే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా స్వీటి కాస్త తగ్గమ్మా…