ఎన్టీఆర్, చరణ్ ల కోసం వర్క్ షాప్ నిర్వహించనున్న రాజమౌళి

  • March 3, 2018 / 07:42 AM IST

కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నప్పుడు వారికీ నటనలో శిక్షణ ఇవ్వడానికి, పాత్రల గురించి పూర్తిగా అవగాహన పెంచడానికి దర్శకులు వర్క్ షాప్ నిర్వహిస్తుంటారు. దీని వల్ల ప్రొడక్షన్ ఖర్చు తగ్గడంతో పాటు సినిమా బాగా వస్తుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ కి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ నటన, డ్యాన్సులతో తెలుగువారిని అలరించారు. సూపర్ హిట్స్ అందుకున్నారు. అయినా వీరికి రిహార్సల్స్ అంటే ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ కష్టపడుతుండగా.. చరణ్ రంగస్థలాన్ని పూర్తి చేసి.. బోయపాటి శ్రీను ప్రాజక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. దీని తర్వాత ఇద్దరూ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.

ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ చాలా పక్కాగా, సైలెంట్ గా సాగుతోంది. ఏ కార్యక్రమాలకు హాజరుకాకుండా ఈ స్క్రిప్ట్ పైనే జక్కన్న దృష్టిపెట్టారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం రాజమౌళి జూలైలో 20 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ ఫైట్ సీన్స్ రిహార్సల్స్ చేయనున్నట్టు సమాచారం. బాహుబలి సినిమా సమయంలో నటీనటులతో కత్తి ఫైట్స్ కి, గుర్రాల స్వారీకి రిహార్సల్స్ చేయించి ఘన విజయాన్ని అందుకున్న రాజమౌళి.. ఈ సినిమాకి కూడా రిహార్సల్స్ ని వదలడం లేదు. సో విజయం కూడా రాజమౌళి వదలదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus