దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెర వెనుక ఉండి నడిపించడమే కాదు.. అప్పుడప్పుడు తెరముందుకొచ్చి అలరించారు. బాహుబలి, మజ్ను చిత్రాల్లో కొంతసేపు కనిపించి మెప్పించారు. ఇప్పుడు ఎక్కువ నిడివిగల పాత్రలో నటించడానికి ఒకే చెప్పారు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన కరుణ కుమార్ కొన్నేళ్ల క్రితం నితిన్ తో ద్రోణ అనే సినిమాని తీశారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పటి నుంచి మంచి కథ కోసం వెతికిన కరుణ కుమార్ కి డైరక్టర్ హరి ప్రసాద్ రాసిన కథ నచ్చింది. ఇతను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి… రీసెంట్ గా దర్శకుడు అనే చిత్రాన్ని డైరక్ట్ చేశారు.
సో హరి ప్రసాద్ కే మాటలు రాసే పని అప్పగించారు. ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ స్క్రిప్ట్ ని తన గురువు రాజమౌళి కి కరుణ కుమార్ వినిపించారు. కథ విన్న రాజమౌళి.. బాగుంది.. చక్కగా తీయమని చెప్పారంట. అయితే కరుణ్ కుమార్ ఇందులోని కీలకమైన డాక్టర్ రోల్ చేయమని కోరడంతో.. శిష్యుడు కోరిక జక్కన్న కాదనలేక పోయారని ఫిలిం నగర్ వాసులు తెలిపారు. ఈ మూవీలో అందరూ కొత్త వారే నటించనున్నారు. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.