వెంకటేష్ సినిమాలో నటించనున్న డాక్టర్ రాజశేఖర్!

Advertisement

ఈగోల జోలికి వేళ్ళని హీరో వెంకటేష్.. కథ నచ్చాలే కానీ పాత్ర ఎంత చిన్నదైనా చేయడానికి రెడీ గా ఉంటారు. పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాల స్టార్ హీరో ఎవరంటే వెంకటేష్ పేరు మొదటగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా మరో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గురు సినిమా తర్వాత డిఫెరెంట్ కథ కోసం వెయిట్ చేసిన వెంకటేష్ చివరికి తేజ చెప్పిన కథకి ఒకే చెప్పారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వెంకటేశ్ బర్త్ డే (డిసెంబర్ 13)న మొదలుకాబోతోంది. “ఆటా నాదే.. వేటా నాదే” అనే అటైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్రంలో కాలేజీ లెక్చలర్ గా వెంకటేష్ కనిపించనున్నారు. అయితే ఇందులో మరో కీలక రోల్ ఉంది. అదే వెంకటేష్ కి బావ రోల్.

ఆ పాత్రలో దగ్గుబాటి రానా, నాగచైతన్యల ని నటింపజేయించాలని అనుకున్నారు. వారే కాకుండా మాధవన్, సుమంత్, నారా రోహిత్ లను పరిశీలించారు. కానీ సెట్ కారని భావించి ఆ రోల్ కోసం డాక్టర్ రాజశేఖర్ ని సంప్రదించారు. అనేక ఏళ్ళ తర్వాత రాజశేఖర్ గరుడ వేగంతో విజయాన్ని అందుకున్నారు. ఆ ఉత్సాహంతో వేగంగా సినిమాలు చేయాలనీ భావిస్తున్నారు. హీరోగానే కాకుండా.. మంచి రోల్ ఉంటే చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. సో వెంకటేష్ సినిమాలో నటించడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ వార్త నిజమైతే వెంకీ మరో మారు మల్టీ స్టారర్ మూవీ చేసినట్లే అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus