యాంగ్రీ యంగ్ మేన్ కాస్తా యాంగ్రీ స్టార్ అయ్యాడు

Advertisement

1980లో హీరోగా తన కెరీర్ మొదలెట్టిన రాజశేఖర్ పోషించిన పోలీస్ పాత్రలు చూసి ఆయనకు జనాలు “యాంగ్రీ యంగ్ మెన్” అనే బిరుదు ఇచ్చారు. “గరుడ వేగ” సినిమాకు ముందు వరకూ ఆ బిరుదును అలాగే కంటిన్యూ చేసిన రాజశేఖర్ నేటితో 56 ఏళ్ళు నిండి.. 57వ సంవత్సరంలోకి అడుగిడనున్నారు. 60కి దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా సినిమాల్లో యాంగ్రీ యంగ్ మెన్ అని వేసుకోవడం నచ్చలేదు ఆయనకి అందుకే తన కొత్త సినిమా “కల్కి”కి యాంగ్రీ యంగ్ మెన్ బదులు “యాంగ్రీ స్టార్” అనే బిరుదును తగిలించుకున్నాడు.

నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకొని “కల్కి” టీజర్ ను విడుదల చేశారు. 80ల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఎప్పట్లానే పోలీస్ రోల్ ప్లే చేస్తుండగా “అ!” ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోందని టీజర్ తోనే అర్ధమైంది. “గరుడ వేగ” హీరోగా తన ఉనికిని ఘనంగా చాటుకున్న రాజశేఖర్ “కల్కి”తో మళ్ళీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు. నందిత శ్వేత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus