గరుడ వేగ తర్వాత రాజశేఖర్ మూవీ ఫిక్స్

  • July 21, 2018 / 11:13 AM IST

రొటీన్ కథలకు భిన్నంగా కథలు రాసుకోవడం సాహసమే అవుతుంది. ఆ కథని వెండితెరపై ఆవిష్కరించాలంటే ధైర్యం కావాలి. అలా విభిన్నంగా అలోచించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా “అ!”. ఈ చిత్రం అందరితో “అ..” అనిపించింది. అలాగే అతనికి ఆఫర్లు తెచ్చిపెట్టింది. అతను మాత్రం రాజశేఖర్ తో మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యారు. యాక్షన్ చిత్రాల్లో నటించి డాక్టర్ రాజశేఖర్ కొన్నేళ్లుగా హిట్ లేకపోవడంతో తెరమరుగు అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలు బీట్ చేస్తూ పీఎస్వీ గరుడ వేగ తో దూసుకువచ్చారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రాజశేఖర్ కి పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతనికూడా అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే రాజశేఖర్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యారు. అతనితోనే సినిమా చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. “నా తర్వాతి సినిమా అదేనని చెప్పడానికి సంతోషిస్తున్న అది ఎలా ఉంటుందంటే…. అ!ద్భుతంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. తన తర్వాతి సినిమా “AWEsome ” అంటూ ట్వీట్ చేశారు. వీరి ఇద్దరి కలయికలో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్ జరుగుతోంది. అవి పూర్తికాగానే ఈ ప్రాజక్ట్ గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus