నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస హిట్స్ తో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మంచి బజ్ ఉంది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా చేస్తున్నాడు బాలయ్య.
‘పెద్ది’ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా లేదా సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
మొత్తానికి వీరి కాంబోలో ప్రాజెక్టు సెట్ అయ్యింది. ‘ఎన్ బి కె 112’ వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ ఎంపికైనట్టు తాజా సమాచారం. రాజశేఖర్ ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘ఎక్స్ట్రా’ ‘బైకర్’ వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో రాజశేఖర్ నటన బాగున్నప్పటికీ.. ఆశించిన బ్రేక్ అయితే రాలేదు. బాలయ్య సినిమాతో ఆ బ్రేక్ వస్తుందేమో చూడాలి.