విలన్ గా మారుతున్న రాజెంద్రప్రసాద్!
- March 26, 2016 / 10:19 AM ISTByFilmy Focus
ఒక నటుడిగా రాజేంద్రప్రసాద్ ఇప్పటికే అన్ని రకాల పాత్రలూ పోషించేసారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా, కొన్నాళ్ల తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు సైతం చేసిన రాజేంద్రప్రసాద్.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాక క్యారెక్టర్ రోల్స్ చేయడం కూడా మొదలెట్టారు. ఇటీవలే “నాన్నకు ప్రేమతో” సినిమాలో “నాన్న”గా టైటిల్ పాత్రలో జీవించి.. సదరు పాత్రకు ప్రాణం పోసారు.
అయితే.. ఎన్ని రకాల పాత్రలు పోషించినా రాజేంద్రప్రసాద్ లోని నట తృష్ణ తీరలేదు. అందుకే.. త్వరలోనే విలన్ గానూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. అది ఏ సినిమాలో అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. విలన్ గా రాజేంద్రప్రసాద్ నటించడం మాత్రం పక్కా అని తెలుస్తోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















