Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

ప్రతి మాటా ఓ బులెట్‌ లాంటిది అంటారు. అయితే రాజేంద్రప్రసాద్‌ నోటి నుండి వచ్చే మాట ఆ బులెట్‌ కంటే ప్రమాదమైనది. అందుకే ఆయన ఏదైనా సభకు వస్తున్నారు అంటే అక్కడ అందరూ అలర్ట్‌ అయిపోతుంటారు. గతంలో జరిగిన కార్యక్రమాలు.. అందులో ఆయన

మాటలు.. తర్వాత క్లారిటీలు.. ఈ లోపు వచ్చే రచ్చలు అందరికీ తెలుసు. పద్మశ్రీ పురస్కారం వచ్చిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. దీంతో ఆయనేం మాట్లాడతారా అనే ఆసక్తి కలిగింది. అందుకు తగ్గట్టే కొన్ని వ్యాఖ్యలు చేశారాయన.

Rajendra Prasad

అవార్డులు అడిగి తీసుకుంటే భిక్ష అవుతుందని.. అదే వారు ఇస్తే గౌరవం అవుతుందని కామెంట్‌ చేశారురాజేంద్ర ప్రసాద్‌. నాకు పద్మశ్రీ రావడం ఆలస్యమైన మాట వాస్తవం. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది అంటే ప్రాసెస్‌ గురించి మాట్లాడారు. తాను ఆ విషయంలో వెనకబడ్డానేమో తెలియదు అంటే ప్రాసెస్‌పై కామెంట్స్‌ చేశారు. అయితే తానెప్పుడూ అవార్డుల గురించి ఆలోచన చేయలేదు, అవార్డుల కోసం ఆరా కూడా తీయలేదని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. పీవీ ప్రధానిగా ఉండగా ‘అవార్డు అడగకపోయారా? కాదంటారా?’ అని గతంలో ఒకరు సూచన చేశారు. కానీ, మనం అలా అడిగి తీసుకోవడం భిక్ష. వారు ఇవ్వడం విలువ, గౌరవం అని చెప్పాను అంటూ ఆ రోజు మాటలను చెప్పారు. తనకు ఇప్పుడు అవార్డు గౌరవంతో వచ్చిందన్నారు.

అవార్డులు రావడానికి వేరే దారులు ఉంటాయి. దక్షిణాది వారికి రావడానికి ఆలస్యమవుతుంది అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైనా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. చిరంజీవి ఏ కారణంతో, ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు. ప్రతి దానిని నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్త్‌, సౌత్‌ అనే చర్చ ఉంది. అయితే ఇప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో చిరంజీవి ఒకరు. ఇలాంటివి విన్నా మర్చిపోండి అని అన్నారు రాజేంద్రప్రసాద్‌.

అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus