టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ ఇప్పటివరకు రెండుసార్లు అవతారమెత్తాడు. ఆ రెండుసార్లు తన హుకుమ్ జారీ చేసి.. అభిమానులను అలరించాడు. తొలి సినిమాలో కొంతమంది స్టార్ హీరోలు అటు టైగర్ ముత్తువేల్ పాండియన్‌కు సాయం చేశారు. తద్వారా సినిమాకు భారీ వసూళ్లు రావడంలోనూ సాయపడ్డారు. రెండో సినిమాలో ఈ స్టార్ హీరోల కౌంట్‌ను పెంచారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అందులో అందరూ స్పెషలే కానీ. ఒకరు మాత్రం చాలా స్పెషల్.
ఆయనే రోడీ అలియాస్ హృతిక్ రోషన్. యస్ రోడీ పాత్రలో హృతిక్ రోషన్ స్టైలిష్‌గా చూపించిన విధానం ఇండియన్ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్ రోషన్ అభిమానులు 40 ఏళ్ల క్రితం నాటి మరో సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. అదే 1986లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘భగవాన్ దాదా’ . ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జె.ఓం ప్రకాశ్ తెరకెక్కించారు. రాకేశ్ రోషన్ నిర్మాత.
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమాలో 12 ఏళ్ల హృతిక్ రజనీకాంత్ దత్తపుత్రుడిగా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో రజనీతో కలసి నటించ మెప్పించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ‘జైలర్ 2’ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హృతిక్‌కి సౌత్ సినిమా పరిశ్రమలో కాస్త ఫేమ్ ఉన్నా.. ఇప్పుడు ఈ సినిమాతో ఆ ఫేమ్ బాగానే పెరుగుతుంది అని చెప్పొచ్చు.
‘జైలర్’ సినిమాతో రూ.600 కోట్ల విజయాన్ని అందుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత రెండు సినిమాలతో ఇబ్బందికర ఫలితాలు అందుకున్నారు. దీంతో ఇదేంటి తలైవా ఇలా చేస్తున్నాడు అని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ‘జైలర్ 2’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. దీంతో నెక్స్ట్ సినిమాలు ‘ధర్మన్’ ‘కమల్ – రజనీ’ సినిమా మీద అభిమానుల దృష్టి పడింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమారే దర్శకుడు.