పవన్ ని ఫాలో అవుతున్న…రజని!!!

  • July 14, 2016 / 10:40 AM IST

తమిళ తలైవార్ రజనికాంత్  కబాలి సినిమా కోసం ఆయన అభిమానులే కాదు, యావత్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో దాదాపుగా ఈ సినిమాకు 200కోట్లకు పైగా బిజినెస్ జరుగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో తెలీదు కానీ, ఎలానీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఎవ్వరికీ అంతుపట్టదంలేదు కానీ, మరో పక్క అప్పుడే ఈ సినిమాపై నెగేటివ్ ప్రచారం మొదలయ్యింది.

తమిళ తంబీల లెక్కల ప్రకారం….ఈ చిత్రాన్ని మరీ హైప్ చేస్తున్నారని ‘కబాలి’ కి అంత సీన్ లేదని ఆ సినిమాను చూసిన సెన్సార్ వర్గాలే చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మూవీ ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పంజా లాగా ఉంటుంది అని, అదే క్రమంలో భాషా సినిమా షేడ్స్ సైతం ఉన్నాయని. మరికొందరు తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ‘పంజా’ సినిమాలో పవన్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన సొంత గ్యాంగ్ పైనే తిరగబడిన థీమ్ తో తీసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే కథకు కొన్ని చిన్నచిన్న మార్పులతో ‘కబాలి’ కథనం కూడ అలాగే ఉంటుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇంకొందరు అయితే మరికొంత ముందుకు వెళ్ళి…అసలు ‘కబాలి’ లో రజనీ మార్క్ స్టయిల్ లేదని దీనితో ఆయన ఫ్యాన్స్ ఊహించినంత రేంజిలో ఈసినిమా ఉండదని మరీ విష ప్రచారం చేస్తున్నారు. ఏమయ్యిందో తెలీదు కానీ, మొత్తానికైతే అటు రజని అభిమానులు సినిమా బయ్యర్స్ అందరూ కాస్త కలపడుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus