“రాజనీకాంత్” కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే అసలు పరిచయం అవసరం లేని పేరు ఇది. అందుకే ఆయన్ను ముద్దుగా “ఆలిండియా సూపర్ స్టార్” అని పిలుచుకొంటుంటారు. ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం “కబాలి” టీజర్ సృష్టిస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇండియాలోనే అత్యధిక శాతం మంది చూసిన ఏకైక టీజర్ “కబాలి”.
సినిమాలతోనే కాకుండా వ్యక్తిగానూ ఆయన సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన కుమార్తె దర్శకత్వంలో రూపొందిన “విక్రమసింహా” సినిమా ప్రమోషన్ కోసం మొట్టమొదటిసారిగా ట్విట్టర్ లోకి ఎంటరైన సూపర్ స్టార్ కి ట్విట్టర్ లో ఇప్పుడున్న ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా మూడు మిలియన్లు. సౌత్ ఇండియాలో ఈ స్థాయి ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదు. సో, మన ఆలిండియా సూపర్ స్టార్ ప్రస్తుతం ట్విట్టర్ లోనూ ట్రెండింగ్ అవుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు!