పెట్ట లీకులకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ

  • October 8, 2018 / 06:05 AM IST

సినిమా విడుదలయ్యాక పైరసీ అవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మొదట్లో నిర్మాతలు కాస్త బాధపడడం గట్రా చేసేవారు కానీ.. పైరసీని ఆపడం తమ తరం కాదని గ్రహించి పట్టించుకోవడం మానేశారు. కానీ.. ఈమధ్య సినిమా విడుదలకు ముందే.. ఒక్కోసారి షూటింగ్ సమయంలోనే లీక్ అవుతున్నాయి. చిన్న-పెద్ద-భారీ సినిమా అనే తేడా ఏమాత్రం ఉండడం లేదు ఈ లీకు రాయుళ్ళకి. చేతికి సినిమా వచ్చిందా.. వెంటనే ఆన్ లైన్ లో పెట్టేయడమే అన్నట్లుగా తయారయ్యారు. అవి ఫోటోలు అవ్వనివ్వండి.. వీడియోలు కానివ్వండి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.

తాజాగా ఈ లీకుల బారిన పడిన సినిమా “పెట్ట”. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ మొన్నామధ్య లీకైన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమా యూనిట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో వేరే లీకులేమీ జరగలేదు. మళ్ళీ రీసెంట్ గా రజనీకాంత్, త్రిష నటిస్తున్న సన్నివేశాల ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. సన్నివేశాలతోపాటు వీడియో కూడా లీక్ అవ్వడం, సదరు వీడియోను చెన్నైకు చెందిన కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం చేయడం చిత్ర యూనిట్ ను కలచివేసింది. మరి ఈ “పెట్ట” లీకులకు అడ్డుకట్ట వేయడం కోసం యూనిట్ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus