షూటింగ్ కి రజనీకాంత్ రెడీ

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 2010 లో రోబో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అందులో శాస్త్రవేత్త వశీకరన్, రోబో చిట్టి గా నటించి అభినందనలు అందుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. 350 కోట్లతో డైరక్టర్ శంకర్ రోబో అప్డేట్ వెర్షన్ రోబో 2.0 ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా రిచర్డ్ పాత్ర పోషిస్తున్నారు. అతనిపై ఢిల్లీ లోని స్టేడియంలో కొన్ని సన్ని వేశాలను చిత్రీకరించారు.

ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న సూపర్ స్టార్ విశ్రాంతి కోసం రెండు నెలల క్రితం అమెరికాకు వెళ్లారు. మానసిక ప్రశాంతత కోసం అక్కడ వర్జీనియాలో సచ్చిదానంద ఆశ్రమంలో రజనీ కొంతకాలం గడిపారు. గత నెల 24 న తిరిగి చెన్నై కి వచ్చారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న ఆయనను ఆదివారం రోబో నిర్మాతలు కలిశారు.  ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్ కి ప్లాన్ చేయమని ఆ నిర్మాతలకు రజనీ చెప్పినట్లు తెలిసింది. మరో పది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుందని, ఢిల్లీ స్టేడియం లో వశీకరన్ పాల్గొనే సీన్లు పూర్తి చేసి, అనంతరం కీలక సన్నివేశాల కోసం శంకర్ బృందం మొరాకో కు వెళ్లనున్నట్లు సమాచారం. రెండు నెలల విరామం తర్వాత రజనీకాంత్ షూటింగ్ లో పాల్గొనున్నారని తెలిసి ఆయన అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus