అవును మీరు విన్నది నిజమే మూడు దశాబ్దాల తర్వాత ఇద్దరు పెద్ద స్టార్లు రజనీకాంత్, అమితాబచ్చన్ కలిసి సినిమా చేయబోతున్నారు. రజనీ 170 వ చిత్రంగా రాబొతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా ‘జై భీమ్’ వంటి బహుళ జనాదరణ పొందిన చిత్రాన్ని అందించిన జ్ఞాన్వేల్ రాజా దర్శకత్వం వహించనున్నారు. భారీ తారాగాణంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది.
తెలుగు నుంచి రానా దగ్గుబాటి, మళయాళం నుంచి ఫహాద్ ఫాజిల్, మంజూ వారియర్ వంటి అగ్ర నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ 33 సంవత్సరాల తర్వాత నా మెంటర్ అమితాబ్తోకలిసి నటిస్తున్నానని, అందుకు చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇద్దరు సూపర్ స్టార్లను ఇలా ఒకే తెరపై చూడడానికి రెండు కళ్లు సరిపోవంటూ (Rajinikanth) రజనీ, అమితాబ్ అభిమానులు సంబుర పడుతున్నారు. రజనీ, అమితాబ్ చివరగా 1991లో హమ్ అనే చిత్రంలో నటించగా మళ్లీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో మూడు సినిమాలు గిరప్తార్, అందాకానూన్, హమ్ చిత్రాలు వచ్చి విజయం సాధించాయి.
ఇప్పుడు చేస్తున్నది ఈ చిత్రం నాలుగోది కాగా 2024లో విడుదల కానుంది. ఇప్పటికే ‘జైలర్’ సినిమాతో దేశ వ్యాప్తంగా రూ. 800కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి తన సత్తా చాటిన రజనీ.. తన 171 చిత్రాన్ని సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేయనున్నారు.
After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s "Thalaivar 170" directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y
— Rajinikanth (@rajinikanth) October 25, 2023
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!