ఆకాశం లో కబాలి..!!

  • June 30, 2016 / 06:58 AM IST

ఒకడే ఒక్కడు మొనగాడు.. విమానం ఎక్కిన మొనగాడు అంటూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు పాడుకుంటున్నారు. తలైవా పోస్టర్ విమానంపై చేరడమే వారి ఆనందానికి కారణం. రజనీకాంత్  గ్యాంగ్ స్టర్ గా నటించిన తాజా చిత్రం కబాలి జులై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర  యూనిట్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

వాల్ పోస్టర్లు.. హోర్డింగులు, ఆటో, బస్సు యాడ్స్ తో పాటు ఏకంగా విమానం పై చిత్ర పోస్టర్ ని అతికించి సరికొత్త ప్రచారానికి తెరలేపారు. విదేశాల్లో కూడా రజనీకి అధిక సంఖ్యలో అభిమానులున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని ఫ్లయిట్ పై ప్రొమోషన్ కు శ్రీకారం చుట్టారు. మొత్తం నాలుగు ఎయిర్ ఏసియా విమానాలను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఇందులో రెండు దేశీయ, రెండు అంతర్జాతీయ ఫ్లైట్లు ఉన్నాయి.

ఇవన్నీ చెన్నై నుంచి బయలుదేరి స్వదేశం, పరదేశంలోని గమ్య స్థానాలకు చేరుతుంటాయి. ఈ విధంగా విమానంపై ఎక్కిన తొలి  సినిమాగా కబాలి చరిత్రలోకి ఎక్కింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ట్రైలర్ రూపంలో ఒక రికార్డ్ క్రియేట్ చేయగా.. ప్రచార విషయంలో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.  దట్ ఈజ్ కబాలి డా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus