సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది రజినీకాంత్ కి 166 వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఇక ‘పెట్టా’ చిత్రానికి మ్యూజిక్ అందించిన అనిరుథ్… ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడుస్తుంది.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కీర్తి సురేశ్ పేరు వినిపించింది. అటు తరువాత.. ఆమె స్థానంలో నయనతార ను ఖరారు చేసినట్టు వార్తలొచ్చాయి.అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర కథ ప్రకారం రజినీ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారంట. దీంతో ఈ ఇద్దరినీ ఖరారు చేశారట. కీర్తి సురేష్… రజినీ సరసన నటించడం ఇదే మొదటి సారి. అందులోనూ ఈ కాంబినేషన్ పై ఇప్పటికే పలు రకాలుగా ట్రోలింగ్ జరుగుతుంది. రజినీ- కీర్తి సురేష్ కి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ ట్రోలింగ్ జరుగుతుంది. ఇక నయన తార తో రజినీకి ఇది మూడవ చిత్రం కావడం విశేషం. గతంలో ‘చంద్రముఖి’ ‘శివాజీ’ ‘కథానాయకుడు’ వంటి చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి… సెప్టెంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి… దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉన్నారట.