Ram Charan: డంకీ డైరెక్టర్ తో రామ్ చరణ్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?

  • January 1, 2024 / 06:32 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో రామ్ చరణ్ ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేయబోతున్నారంటూ కూడా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించినబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల ఈయన దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు రాంచరణ్ తో సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నేను కూడా ఇటీవల ఈ వార్తలను చదివానని తెలిపారు.

ఇక తాను త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అద్భుతమైనటువంటి నటనను కనబరిచారు. తనని కలిసి కూడా చాలాకాలం అవుతుందని తెలిపారు. అయితే తనతో సినిమా చేయాలని నాకు కూడా ఉంది కానీ ఇప్పట్లో మా కాంబినేషన్లో సినిమా రాలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus